చిలుకూరు మండల కేంద్రంలో జరుగుతున్న సోషల్, ఎకనామిక్ సర్వేను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు ప్రభుత్వ సూచన మేరకు ఫామ్ ను జాగ్రత్తగా నింపాలని ప్రజలు సహకరిస్తే సర్వేకు వచ్చిన అధికారులకు సులభతరం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ స్పెషల్ ఆఫీసర్ సూర్యనారాయణ ఉన్నారు.