నడిగూడెం మండల సీపీఎం కార్యదర్శిగా బృందావనపురం గ్రామానికి చెందిన బెల్లంకొండ సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బెల్లంకొండ సత్యనారాయణ మాట్లాడుతూ మండలంలో అందరు సహకారంతో సీపీఎం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తన ఎంపికకు సహకరించిన జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మట్టిపల్లి సైదులు లకు కృతజ్ఞతలు తెలిపారు.