నడిగూడెం మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రారంభించిన, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి, సూర్యాపేట జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి దండా వెంకటరెడ్డి లు శనివారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, సన్నరకం ధాన్యంతో పాటు దొడ్డు రకం వరి ధాన్యానికి కూడా రూ. 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.