కోదాడ: పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి
పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నడిగూడెం తహసిల్దార్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వంశీ, శ్రీధర్, శ్రీపతి యశ్వంత్, లింగా నాయక్, బన్నీ, గణేష్, గోపి, నాగరాజు, వరుణ్ ఉన్నారు.