మునగాల మండల విద్యాధికారి పిడతల వెంకటేశ్వర్లు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేను ఎన్యుమరేటర్లు అందరూ పటిష్టంగా నిర్వహించాలని కోరారు. మండల కేంద్రంలో శనివారం రైతువేదిక యందు సిబ్బంది అందరికీ మెటీరియల్ పంపిణీ, మరోసారి సూచనలు ఇవ్వడం జరుగుతుందని అందరూ సకాలంలో హాజరు కావాలని తెలియజేశారు.