కోదాడ మండలం కాపుగల్లులోని సర్వేనెంబర్ 292 లో అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను సోమవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించడంతో కోదాడ మండల ఆర్ ఐ రాజేష్, పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుందని వినతిపత్రంలో పేర్కొన్నారు.