విద్యార్థులు రాజ్యాంగ అంశాలు, విలువలను తెలుసుకోవాలని కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ అన్నారు. మంగళవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజ్యాంగం అమలై 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఏడాది పాటు ప్రతిరోజు ప్రార్ధనలో రాజ్యాంగ ప్రవేశికను విద్యార్థులతో చదివించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వినూత్న ప్రదర్శన నిర్వహించారు.