రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. మంగళవారం కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్ డి ఓ సూర్యనారాయణ ఎంపీడీవో రామచంద్రరావు తాసిల్దార్ వాజిద్ అలీ, ద్వారకుంట జిల్లా పరిషత్ హైస్కూల్ హెడ్మాస్టర్ లింగారెడ్డి రెవిన్యూ సిబ్బంది ఉన్నారు.