మందులకు లొంగని సూపర్ బగ్, వ్యాధి కారక శిలీంద్రం కాండియా ఆరిస్ ను ఢిల్లీలోని వీధి కుక్కల చెవిలో గుర్తించారు. ఢిల్లీ విశ్వ విద్యాలయం, కెనడాలోని మెక్ మాస్టర్ వర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఇది వెలుగుచూసింది. పెంపుడు జంతువులు సూపర్ బగ్స్ కు కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఈ శిలీంద్రం వల్ల తీవ్రస్థాయి ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. దీన్ని తీవ్రంగా దృష్టి సారించాల్సిన 4 రకాల ఫంగస్ ల్లో ఒకటిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.