కార్తీకమాసం మొదటిరోజు సందర్భంగా రాజన్న ఆలయంలో ఆలయ అర్చకుల వేదమంత్రాల మధ్య కార్తీక దీపాన్ని వెలిగించి, ప్రదోషకాలంలో గండదీపంపై ఉంచారు. మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించడం కోసం ఈ దీపం వెలిగిస్తారని ఆలయ స్థానాచారి అప్పాల భీమాశంకర్, నమిలకొండ రాజేశ్వరశర్మ అన్నారు. ప్రతి దేవాలయంలో ఈ దీపాన్ని వెలిగిస్తారని, కార్తీకమాసంలో దీపానికి ప్రత్యేకత ఉందని అన్నారు. ఆ దీపం అంతటా వెలుగు కనిపించింది.