వేములవాడ పట్టణంలో నాయి బ్రాహ్మణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో కార్పోరేట్ సెలూన్ కు వ్యతిరేఖంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కోరుట్ల బస్సు స్టాప్ నుండి చెక్కపల్లి బస్సు స్టాప్ వరకు ర్యాలీ చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుందని, కులవృత్తులకు పెద్దపీట వేసింది కేసీఆర్ అని గుర్తు చేశారు.