మహిళల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ తెలిపారు. సోమవారం రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఉమెన్ సేప్టీ వింగ్ వారిచే కమిషనరేట్ షీ టీమ్ విభాగానికి జారీ చేసిన టీజింగ్, ర్యాగింగ్, వర్క్ ప్లేస్ హరస్మెంట్, సోషల్ మీడియా హరస్మెంట్, తల్లితండ్రులు పిల్లలపై దృష్టి అవగాహన సంబంధించిన పోస్టర్లను సీపీ ఆవిష్కరించారు.