ఐటిఐ శిక్షణ పొందిన యువత సింగరేణి సంస్థలోని 11 ఏరియాలలో అప్రెంటిషిప్ చేసేందుకు సింగరేణి ఉద్యోగుల పిల్లలు, మాజీ ఉద్యోగుల పిల్లలు, ప్రాజెక్ట్ ప్రభావిత, పునరావాస గ్రామాల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీ-3 జీఎం సుధాకర్ రావు, ఏపీఏ జీఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 9 నుండి పోర్టర్ లో నమోదు చేసుకోవాలని, ఈనెల 24వ తేదీలోపు ఎంవిటిసి కార్యాలయంలో అందజేయాలన్నారు.