పెద్దపల్లి: నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. బుధవారం ఓదెల మండలం రూపునారాయణపేటలో నూతనంగా హై లెవెల్ వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి 80 కోట్ల రూపాయలను మంజూరు చేయగా, బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. గుంపులలో అప్రోచ్ బ్రిడ్జి రోడ్డు, తనుగుల, విలాసాగరం, జమ్మికుంట వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.