అన్నదాతల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలం మడిపల్లి కాలనీ, అంకంపల్లి, మడిపల్లి, ఆషన్నపల్లి, గంగారం, పెద్దంపేట, లక్ష్మీపూర్, పందిళ్ళ, ఆరేపల్లి గ్రామాల్లో సింగిల్ విండో, ఐకేపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్, సింగిల్ విండో చైర్మన్ రామచంద్రం రెడ్డి పాల్గొన్నారు.