మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మంగళవారం పెద్దపల్లి ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో శ్రీ హనుమాన్ ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, అదనపు పిడీ రవి కుమార్, ఎంపిడిఓ శ్రీధర్, డిపిఎంలు తిరుపతి, రవి, ఏపీఎంలు సంపత్, దివ్య పాల్గొన్నారు.