కాంగ్రెస్ హయాంలో రోడ్లకు మహర్దశ వచ్చిందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. మంగళవారం ఓదెల మండలం మడక నుండి ఓదెల మల్లిఖార్జునస్వామి దేవాలయం వెళ్లే ప్రధాన రహదారి వెడల్పు, డ్రైనేజీ నిర్మాణం కోసం అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులలతో కలిసి పర్యవేక్షించారు. ఈకార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మహేందర్, చీకట్ల మొండయ్య పాల్గొన్నారు.