కుటుంబ వివరాలు పక్కాగా సేకరించాలి: కలెక్టర్

83பார்த்தது
కుటుంబ వివరాలు పక్కాగా సేకరించాలి: కలెక్టర్
పైలట్ ప్రాజెక్టు చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేలో ఎలాంటి పొరపాట్లు లేకుండా కుటుంబ సభ్యుల వివరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం పెద్దపల్లి 24వ వార్డులో జరుగుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి పరిశీలించారు. సర్వే ద్వారా కుటుంబాల నుంచి సేకరిస్తున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி