మెట్ పల్లిలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని బిజెపి కార్యాలయంలో సోమవారం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. దేశహితమే లక్ష్యమై దేశ అభివృద్ధి ధ్యేయమై ధర్మ సంస్థాపనయే సంకల్పమై దేశ సేవలో నిఘ్నమైన బిజెపిలో సభ్యత్వం తీసుకొని చేరండి అని రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి అన్నారు. ఈ యొక్క సమావేశానికి మండల అధ్యక్షులు, మండల ఇన్చార్జులు, ముఖ్య నేతలు హాజరయ్యారు.