ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగానికి ప్రపంచ దేశాలతో ఎంతో గుర్తింపు ఉన్నదని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. భారత రాజ్యాంగం ఆమోదించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్, వేణు, ఆర్ఎస్ఐలు, డీపీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.