మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. కార్తీక మాసం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తులు స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకుంటున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తలనీలాలు సమర్పించి, స్నానం ఆచరిస్తున్నారు. అనుబంధ ఆలయాలైన బేతాళుడు, రాములవారిని దర్శించుకుంటున్నారు.