రైలులో ఆహార పదార్థాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఇటీవల వందే భారత్ లాంటి రైళ్లలో కూడా క్వాలిటీ లేని ఆహార పదార్థాలను చూశాం. తాజాగా అటువంటి చేదు అనుభవమే ఓ ప్రయాణికుడికి ఎదురైంది. అతడికి సెర్వ్ చేసిన రైతాలో జెర్రి కనిపించింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఐఆర్‌సీటీసీని ప్రశ్నించాడు. VIP ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లో ఇలాంటి ఆహారం వడ్డిస్తే ఇక సాధారణ రైళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అని రాసుకొచ్చాడు.