సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నేడు గురువారం సిద్దిపేటలోని టీటీసీ భవనంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నారని మంత్రి క్యాంపు కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.