ఇంటి నుంచి వచ్చే తడి చెత్తతో ఎరువును తయారు చేసుకొని మొక్కలకు వాడుకోవచ్చని హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రజిత అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలోని డీఆర్సీసీ కేంద్రం వద్ద చెత్త ప్రాసెసింగ్ విధానంపై వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇంటి వద్ద వేరుచేసి ఇచ్చిన చెత్తలో పొడి చెత్తను డీఆర్సీసీ కేంద్రం వద్దకు తీసుకువచ్చి రీసైక్లింగ్ చేసుకోవచ్చన్నారు.