సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో ఇటీవల మరణించిన మేకారి బాబు కుటుంబాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందన్ గౌడ్ ఆదివారం పరామర్శించారు. కుటుంబానికి ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అవయవాలు దానం చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తూ బిజెపి పార్టీ తరపున అన్నివేళలా కుటుంబానికి అండగా ఉంటామని భరాసనిచ్చారు. పరామర్శించిన వారిలో ఉమ్మడి కొండపాక మండల అధ్యక్షుడు శశిధర్ రెడ్డి , కుకునూరు పల్లి గ్రామ అధ్యక్షుడు గౌరారం కృష్ణ, బిజెపి కార్యకర్తలు, కుకునూరు పల్లి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.