కొండపాక కుకునూరుపల్లి గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 13వ రోజు కొనసాగుతున్న సమ్మె మంగళవారం రోజున వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వర్షంలో ఒంటి కాలిపై కొంగ జపం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో జాలిగామ ప్రభాకర్ జేఏసీ నాయకులు ర్యాగల లక్ష్మణ్, భోగి సాయికుమార్, కొమ్ము నర్సింలు, ఏలేశ్వరం రవి,తదితరులు పాల్గొన్నారు.