ప్రజ్ఞాపూర్ కు చెందిన మహమ్మద్ అష్రఫ్, సాయి కుమార్ లు మిర్చి బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వారు బీహార్ కు చెందిన రాహుల్ వద్ద గంజాయి కొనుగోలు చేసి ఉపయోగించడమే కాకుండా విక్రయించేవారు. గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు మంగళవారం పోలీసులు దాడి చేసి, వారి వద్ద నుండి 335 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.