మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్య
ఈతకళ్లు దొంగతనం చేశారని నేరంమోపి జరిమానా విధించడంతో తీవ్ర మనస్తాపం చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దౌల్తాబాద్ మండలం ముత్యంపేట గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 24న పరుశరాములు, తోడంగి రామచంద్రంతో పాటు ముత్యాల ఆంజనేయులు గ్రామంలోని ఈతవనంలో ఈతకళ్లు దొంగతనం చేశారని పంచాయతీ నిర్వహించి ముగ్గురిని చితకబాదారు. రూ. 2 వేల జరిమానా విధించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది ఆంజనేయులు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.