బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం కారణంగా తమిళనాడులోని కడలూరు, మైలాడుదురై, తిరువారూర్ జిల్లాల్లో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. దీంతో బుధవారం (నవంబర్ 27) ఈ మూడు జిల్లాల్లో అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయు గుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన పడింది. వాయు గుండం ఎఫెక్ట్‌తో రానున్న రెండు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.