సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ యువజన
కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం మజ్జిగ పంపిణీ చేశారు. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన
భారత్ జోడోయాత్ర ప్రారంభించి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో యువజన
కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పటేల్, నియోజకవర్గ అధ్యక్షుడు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో మొహబ్బత్ కి దుకాన్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఉచితంగా మజ్జిగను పంపిణీ చేశారు.