జహీరాబాద్ మండలం గోవింద్ పూర్ గ్రామస్తులు సమీపంలోని పరిశ్రమల వ్యర్థాలతో రోగాలబారిన పడుతున్నారు. పరిశ్రమ వ్యర్థాలను గ్రామ శివార్లలో పారబోస్తుండడంతో దుర్గంథం వెదజల్లుతోంది. ఆ వాసనకు గ్రామస్తులు పలు రకాల వ్యాధులు వస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వీఆర్ఓకు, తహసీల్దార్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వ్యర్థాలను గ్రామంలో పారబోస్తున్న పరిశ్రమల యజమానులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.