జిహెచ్ఎంసి ఎన్నికలలో భాగంగా రామచంద్రాపురం,భారతి నగర్ 111వ డివిజన్ గోదావరి అంజిరెడ్డికి మద్దతుగా జహీరాబాద్ నుండి బిజెవైఎం నాయకులు పాల్గొన్నారు. మంగళవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీ డాక్టర్ గడ్డం వివేక్ వెంకట స్వామి రామచంద్రాపురంలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నౌబాద్ జగన్నాథ్,బిజెవైఎం జహీరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ నరేశ్ పాటిల్,పట్టణ కార్యదర్శి మాదినం శివ ప్రసాద్,మండల్ ప్రధాన కార్యదర్శి గాజుల జగన్నాథ్, నాగరాజు,మండల్ కార్యదర్శి శ్రీకాంత్,వటం సిద్దు,రమేష్,నరేష్,తదితరులు పాల్గొన్నారు.