సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవింద్ పూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ యువ నాయకులు పెద్ద ఎత్తున స్వీట్లు పంచుకొని బాణసంచా కాల్చారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జండా ఎగరాలని బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమ అనిల్ కోరారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల్ కార్యదర్శి శ్రీకాంత్, బీజేపీ శంకర్, సుభాష్, గంజి అంజన్న, జగన్, అడివన్న ముదిరాజ్, రఘుపతి, సుధాకర్ రెడ్డి, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.