విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపరిచేల ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈఓ శంకర్ మంగళవారం సూచించారు. సదాశివపేట మండలంలోని ప్రాథమిక పాఠశాల, ఎన్కేపల్లి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులచే తెలుగు మరియు ఇంగ్లీషు చదివించి వ్రాయించడం జరిగిందని, గణితంలో చతుర్విధ ప్రక్రియలు చేయించడం జరిగిందని మండల విద్యాధికారి ఎన్. శంకర్ తెలిపారు. విద్యార్థుల సామర్ధ్యాలు పరిశీలించారు.