బాలికలకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. బాలికలకు వరకట్న నిషేధ, ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. సమావేశంలో పాఠశాల హెచ్ఎం పాల్గొన్నారు.