ఇన్ స్పైర్ గైడ్ ఉపాధ్యాయ సమావేశం ఈనెల 8వ తేదీన సంగారెడ్డిలో నిర్వహిస్తున్నట్లు డిఈఓ వెంకటేశ్వర్లు బుధవారం ఓ ప్రకటన తెలిపారు. 21 నుంచి 23వ తేదీ వరకు జరిగే జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనపై సమావేశంలో చర్చ జరుగుతుందని చెప్పారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమావేశానికి హాజరు కావాలని సూచించారు.