ఎంబీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బిసి కమిషన్ చైర్మన్ నిరంజన్ కు బుధవారం సంగారెడ్డిలో వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడుపతి వీరేశం మాట్లాడుతూ, ఎంబీసీ భవనానికి స్థలం కేటాయించి 50 లక్షలు ఇవ్వాలని కోరారు. ఎంబీసీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.