బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ నగర్ లో పారిశుద్ధ్య సమస్యతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం విషయం తెలుసుకున్న జిల్లా ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు లక్ష్మారెడ్డి సమస్యను మున్సిపల్ అధికారులకు విన్నవించారు. ఈ మేరకు వెంటనే స్పందించిన కమిషనర్ మంగతాయారు పారిశుద్ధ్య సిబ్బందితో మురుగు కాలువలను శుభ్రం చేయించారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.