సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో ఆదివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి జిన్నారం మండల కేంద్రంలోని అక్కమ్మ చెరువు మత్తడి దూకుతుంది. అలుగు పారడంతో పెద్ద ఎత్తున సందర్శకులు చెరువు వద్దకు వచ్చి ఈ అందమైన దృశ్యాలను తమ సెల్ ఫోన్ లో బంధిస్తున్నారు. వర్షాలు బాగా పడి చెరువు నిండడంతో ఈ ఏడు పంటలు బాగా పండుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.