గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి: సీఐ
కంగ్టి పోలీస్ సర్కిల్ పరిధిలోని కల్హేర్, సిర్గాపూర్ మండలాల్లో గణేష్ నిమజ్జనం కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ చంద్రశేఖర్ రెడ్డి శనివారం తెలిపారు. సీఐ మాట్లాడుతూ వినాయక నిమజ్జనంలో ప్రజలందరూ భక్తిశ్రద్దాలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. వినాయక నిమజ్జన ఊరేగింపులో డీజే సౌండ్ లకు అనుమతి లేదని, చెరువులు, కుంటాల వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు.