పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు హక్కును అర్హులైన వారు నమోదు చేసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. జహీరాబాద్లో మంగళవారం ఎమ్మెల్సీ ఓటు పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.