ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా ప్రజల నుంచి సోమవారం వినతి పత్రాలను స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ రెవెన్యూ మున్సిపల్ వివిధ శాఖలకు సంబంధించి 52 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదరపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్ఓ పద్మజ రాణి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.