నారాయణఖేడ్ మండలంలోని సంజీవన్ రావుపేటలో గ్రామంలో సోమవారం మధ్యాహ్నం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కలుషిత నీరు సేవించి గ్రామంలో ఇద్దరు మృతి చెందగా 50 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్థానికంగా కొనసాగిన వైద్య శిబిరం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కలుషిత నీరు రావడానికి మీరంటే మీరు కారణమని దోబూచులాడుతూ పరస్పరం దాడులకు దిగారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.