సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం లోని సింగితం గ్రామం యూత్ కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం బి.ఆర్ అంబేద్కర్ రమా బాయి దంపతుల పెళ్లి రోజును ఘనంగా నిర్వహించారు. రాజు కుర్మ మాట్లాడుతూ ప్రపంచం లోనే గొప్ప మేధా శక్తి గల వారు అంబేద్కర్ అని కొనియాడారు. ముంబయి లోని చేపల మార్కెట్ లో 1906 ఏప్రిల్ 4న నిరాడంబరంగా వీరి వివాహం జరిగిందని చెప్పారు. ప్రతి పౌరుడు బిఆర్ అంబేద్కర్ అడుగు జాడల్లో నడవాలని అన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ప్రభాకర్, భీమ్ ఆర్మీ అధ్యక్షులు అనిల్ రావణ్, ఉపాధ్యక్షులు మోహన్, సిద్దారెడ్డి, పి.రాజు, నర్సింహులు ఏ.రాజు, నర్సింహులు, రాంరెడ్డి, పెంటయ్య, సల్తయ్య, అంజయ్య, చెంద్రయ్య, అనిల్, బిచప్ప, గ్రామస్థులు పాల్గొన్నారు.