రాష్ట్ర స్థాయిలో ఎంపికైన రవి యంత్రం

26905பார்த்தது
రాష్ట్ర స్థాయిలో ఎంపికైన రవి యంత్రం
వ్యవసాయ సాగులో ఎదుర్కొంటున్న కష్టాలను కళ్ళారా చూసిన ఓ రైతు తన అద్భుత ఆలోచనలకు అతని సృజనాత్మకతను జోడించాడు. ఒక యంత్రాన్ని తయారు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న "రైతు రవి" పై లోకల్ యాప్ లో ప్రత్యేక కథనం మీ కోసం...

ప్రపంచానికి అన్నం పెట్టె రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఆన్ లైన్ ద్వారా సృజనాత్మతను వెలికితీసే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. మంత్రి కేటీఆర్ ఆలోచనల మేరకు ఏర్పాటు చేసి గత సంవత్సరం నుండి ప్రతి ఆగస్టు15న ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరించారు.

ఇందులో భాగంగా జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని లింగాల ఘనపూర్ మండలం క్రిష్ట గూడెం గ్రామానికి చెందిన రైతు ఏలా రవి తన వ్యవసాయ పొలంలో కలుపు యంత్రాన్ని తయారు చేశాడు. రవి స్వతహాగా రైతే కాక మోటారు సైకిల్ మెకానిక్ కూడా చేస్తూ అతని ఆలోచనతో ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో కూలిలు దొరకక, పెరిగిన కూలీ రేట్లను ఇచ్చుకోలేక ఇబ్బంది పడుతున్న సమయంలో తనకు వచ్చిన ఒక్క ఆలోచనతో పాడైన మోటారు సైకిల్ ను ఉపయోగించి తన ఆలోచనకు తగట్టుగా కలుపు యంత్రాన్ని తయారు చేసి తన పొలంలో ఒక్కరి సహాయంతో తనకున్న పొలంలో కలుపు తీసుకోవడంతో పాటు మిగతావారికి ఉపయోగపడేలా ఈ యంత్రాన్ని తయారు చేశాడు. సృజనాత్మకత అనేది ఎవరి సొత్తు కాదని, రవి నిరూపించాడు. ఈ ఇన్నోవేషన్ తో గ్రామస్తులంతా రవిని ఇంజనీర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇతను చేసిన ఆవిష్కరణ జిల్లా నుండి సెలెక్ట్ అయినందుకు జిల్లా కలెక్టర్ కె. నిఖిల రవిని అభినందించారు.

రైతు రవి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రజల టాలెంట్ ను గుర్తించడానికి చేపట్టిన ఈ ప్రోగ్రాంలో తనకి చోటు దక్కడం సంతోషంగా ఉందని అన్నారు. ఎంతో అభివృద్ధి చెందిన భారతదేశంలో అత్యాధునిక యంత్రాలు ఇంకా అందుబాటులోకి లేవని, వాటిని అందిస్తే రైతులు లాభాలు గడిస్తామని అన్నాడు.

10వ తరగతి చదివిన రవి... ఒక సంవత్సర క్రితం తాను తయారు చేసిన యంత్రాన్ని చూసి వివిధ గ్రామాలకు చెందిన రైతు వారికి సైతం కావాలనడంతో తయారు చేసి ఇచ్చాడు. ఎవరికైనా కావలసిన వారు సంప్రదించవలసిన నంబర్: 9441547018

ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ లో తెలపండి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி