షాద్నగర్ పట్టణంలోని ఫరూఖ్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం షాద్ నగర్ ఆర్డీవో ఎన్. ఆర్. సరిత సందర్శించారు. పాఠశాల పర్యావరణం అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ వెంకన్నతో ఫోన్ ద్వారా మాట్లాడి పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్య పనులను వెంటనే వేయించాలని కోరారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వంటకాలు, భోజనాలను పరిశిలించారు.