విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమని, క్రీడలతో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని కళాశాల చైర్మన్ కరుణాకర్ రెడ్డి అన్నారు. మంగళపల్లి లోని శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్ మైదానంలో సోమవారం స్పోర్ట్స్ మీట్‌ను కళాశాల ప్రిన్సిపాల్ తో కలిసి ప్రారంభించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ. క్రీడలతో శారీరక దృఢత్వం, ప్రశాంతత లభిస్తుందన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని క్రీడలను నిర్వహించారాని తెలిపారు.