తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షలను సజావుగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ, శాంతి కుమారి శుక్రవారం అధికారులను ఆదేశించారు. ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సిఎస్ శాంతి కుమారి, సచివాలయం నుంచి అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.