బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చాన్నాళ్ల తర్వాత తన గొంతుక వినిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైనశైలిలో ధ్వజమెత్తారు. శనివారం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు జరిగాయి. పలువురు నేతలకు పార్టీలోకి స్వాగతం పలికిన కేసీఆర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైందని అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడిచాయని, ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలని స్పష్టం చేశారు.