హైదరాబాద్ విశ్వ నగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. నగర జనాభా కోటి దాటాక, అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఇక నగర అభివృద్ధి, గ్రేటర్ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గటం లేదు. విస్తరిస్తున్న మహానగరంలో ప్రజలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు జిహెచ్ఎంసీ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా శనివారం ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తోంది.